హిందీలో రీమేక్ కానున్న ఆకాశం నీ హద్దురా…హీరో ఎవరంటే?

Monday, November 16th, 2020, 12:38:55 PM IST

సుధా కొంగర దర్శకత్వం లో తెరకెక్కిన ఆకాశం నీ హాద్దురా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ్ తో పాటుగా తెలుగు లో కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం హీరో సూర్య విశ్వరూపం ను చూపించింది. సూర్య నటన కి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. అయితే ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదొక రోలర్ కొస్టర్ అంటూ కొనియాడారు.

అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి, జెర్సీ లాంటి మంచి సినిమాలని రీమేక్ చేసిన షాహిద్ కపూర్ ఇప్పుడు ఈ ఆకాశం నీ హద్ధురా చిత్రం ను రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. అయితే ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జెర్సీ రీమేక్ తో బిజీ గా ఉన్న షాహిద్ ఇప్పుడు మరొక సౌత్ సినిమా పై కన్ను వేయడం తో సౌత్ ఇండస్ట్రీ పై బాలీవుడ్ ప్రముఖులు సైతం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.