సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత..!

Tuesday, September 8th, 2020, 08:15:45 AM IST

సీనియర్ నటుడు, కమెడీయన్ జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. నేడు తెల్లవారుజామున గుంటూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే పడి అక్కడికక్కడే మృతి చెందారు. కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల ఆయన స్వగ్రామం కాగా సినిమాలోకి రాకముందు ఆయన ఎస్సైగా పనిచేశారు.

అయితే బ్రహ్మపుత్రుడు సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన జయప్రకాశ్ రెడ్డి ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు వంటి ఎన్నో పెద్ద సినిమాలలో నటించి తనదైన శైలిలో కామెడీ పండించాడు. అయితే కమెడియన్‌గానే కాకుండా విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ చరిత్రలో జయప్రకాశ్ రెడ్డి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.