మెగాస్టార్ “అర్బన్ మాంక్ లుక్” రహస్యమిదే!

Tuesday, September 15th, 2020, 03:02:33 PM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుండి నూతనొత్సాహం తో దూసుకు పోతున్నారు. ఇటీవల సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టిివ్ గా ఉంటున్నారు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అర్బన్ మాంక్ లుక్ అంటూ గుండు తో ఉన్న ఒక ఫోటో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటో కి సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. నెటిజన్లు మాత్రమే కాకుండా, సెలబ్రిటీలు సైతం మెగాస్టార్ చిరంజీవి లుక్ పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెగాస్టార లుక్ సూపర్ అంటూ కామెంట్స్ చేశారు.

అయితే దీని పై మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇంత క్రేజ్ రావడానికి గల కారణం చిరు డిఫెరెంట్ గా కనిపించడమే. అయితే చిరు నిజంగా గుండు చేయించుకోలేదు. సినిమా లోని ఒక పాత్ర కోసం చిరు మేకప్ వేస్కున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు మేకప్ ఆర్టిస్టులు ఎంతో కష్టపడి చిరు కి ఆ లుక్ తెచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది. ఏదేమైనా మెగాస్టార్ అలా డిఫెరెంట్ లుక్ లో కనిపించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.