పైసా వసూల్.. “సర్కారు వారి పాట” మోషన్ పోస్టర్ టీజర్.!

Sunday, August 9th, 2020, 09:37:58 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఈరోజు కావడంతో సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ లేస్తుంది. ఓ పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ట్వీట్ల తో పాత రికార్డుల తుక్కు రేగ్గొడుతుంటే వారికి మరింత ఎనర్జీ ఇచ్చేలా తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” టీం ఇచ్చిన గిఫ్ట్ మామూలుగా లేదని చెప్పాలి.

ఈ స్పెషల్ డే కోసం గత కొన్ని రోజుల నుంచి ఎంత గానో టీజ్ చేస్తున్న టీం ఎట్టకేలకు మోషన్ పోస్టర్ రూపాన ఇపుడు దీనిని వదిలారు. మొదటి నుంచి హైలైట్ చేస్తున్న రూపాయి కాయిన్ తోనే మొదలు కొని ఓంకారం తాడు ఉన్న చేత్తో సూపర్ స్టార్ మహేష్ ఆ కాయిన్ ను ఎగురవేయడం సూపర్బ్ గా అనిపించాయి.

ఇక ముఖ్యంగా మరో హైలైట్ ఏంటంటే ఈ టీజర్ కు బ్యాక్గ్రౌండ్ లో ఎస్ ఎస్ థమన్ అందించిన పవర్ ఫుల్ మాస్ బిజీఎం అయితే దూకుడు రోజులను గుర్తు తీసుకురాక మానవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మోషన్ పోస్టర్ చెప్తుంది సినిమా “పైసా వసూల్” అని..