వంద కోట్ల క్లబ్‌లోకి చేరిన సరిలేరు నీకెవ్వరు.. ఓన్లీ త్రీ డేస్..!

Tuesday, January 14th, 2020, 09:40:11 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతి కానుకగా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్‌ని తెచ్చుకుంది. ఆర్మీ లుక్‌లో మహేష్ నటన, విజయశాంతి యాక్టింగ్ రోల్, ప్రకాష్ రాజ్ విలనిజం, అనిల్ రావిపూడి కామెడీ, దేవి నేపధ్య సంగీతం ఇలా అన్ని ఈ సినిమాలో ఉండడం, ప్రేక్షకులను బాగా అలరించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.

ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్‌ రాగా, రెండోరోజు రూ.32.77 కోట్ల షేర్‌, ఇక మూడో రోజు 20 కోట్ల షేర్ వచ్చినట్టు తెలిపింది. మొత్తానికి మూడు రోజులలోనే 103 కోట్ల షేర్ వసూల్ చేసి మహేశ్ మరోసారి రికార్డ్ సృష్టించాడు.