యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న “సారంగదరియా” సాంగ్..!

Tuesday, March 16th, 2021, 01:00:07 AM IST

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా క్లాసిక్ అండ్ రొమాంటిక్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటుంది. రెండు వారాల కిందట విడుదలైన ఈ సినిమాలోని ‘సారంగదరియా’ సాంగ్ ఫుల్ పాపులారిటీనీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సాంగ్ మరో రికార్డు కూడా క్రియేట్ చేసింది.

అయితే ఈ పాట రిలీజ్ అయిన 14 రోజుల్లోనే యూట్యూబ్‏లో 50 మిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసింది. అయితే ఇప్పటివరకు తెలుగులో ఇంత తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఫస్ట్ సాంగ్‌గా సారంగదరియా సాంగ్ నిలవడం విశేషం. ఇక ఈ సాంగ్ కంటే ముందు తమిళంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన మారి 2లోని “రౌడీ బేబి” సాంగ్ కేవలం 8 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్‌కు 18 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయగా, రాములో రాములా పాటకు 27 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి.