బన్నీ ‘సరైనోడు’ సత్తా ఏమిటో తెలిసిపోయింది.. !

Wednesday, April 20th, 2016, 08:05:46 PM IST


బ్రూస్లీ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి పరాజయాల తరువాత మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న చిత్రం ‘సరైనోడు’. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పైనే మెగా అభిమానులంతా ఆశలు పెట్టుకున్నారు. బన్నీ అయినా ఈ ఏడాది ఓ సంతృప్తికరమైన విజయన్నందిస్తాడని అనుకుంటున్నారు. ఏప్రిల్ 22న విడుదలకు సిద్దమైన ఈ చిత్రం ఈరోజు నగరంలోని ఓ ప్రముఖ థియేటర్లో సినీ పరిశ్రమ వ్యక్తుల కోసం ప్రదర్శింపబడింది. ఈ ప్రదర్శనతో సరైనోడు రిజల్ట్ బయటకొచ్చింది.

మొదటి నుండి అనుకున్నట్లే మాస్ డైరెక్టర్ బోయపాటి చేతుల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ట్రైలర్లకు తగ్గట్టే మాస్ ప్రేక్షకులకు కావలసిన ఫుల్ మాస్ మసాలా కంటెంటును అందించిందట. మొత్తంగా సినిమా బన్నీ చెప్పిన ఊరమాస్ డైలాగుకు సరిపోయేలా ఊర మాస్ గా ఉందని సినీ వర్గాల విశ్లేషణ. ఇకపోతే ఈ మాస్ చిత్రాన్ని ఈ వేసవిలో కుటుంబ, మహిళా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.