పైకేమో హిట్టవ్వాలంటారు..లోపలేమో ఇలా..!

Wednesday, January 15th, 2020, 04:16:45 PM IST

ఇప్పుడు మన తెలుగు సినిమాల పరిస్థితులు కాస్త మెరుగు పడ్డాయి అనుకుంటే పొరపాటే.ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చెయ్యడంలో అదిరిపోయే నాణ్యతను అందిస్తున్నారు కానీ ఎవరి ఈగో అలాగే ఉంది అనిపిస్తుంది.పండుగ తరుణంలో తమ చిత్రాలతో పాటు వస్తున్న ఇతర చిత్రాలు కూడా హిట్టవ్వాలని కోరుకుంటారు కానీ తీరా విడుదలయ్యాక మాదంటే గొప్ప మాదే తోపు సినిమా అంటూ పోస్టర్లు వేసి అభిమానుల మధ్య చిచ్చు కు ప్రధాన కారకులు అవుతున్నారు.

ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన “సరిలేరు నీకెవ్వరు” మరియు “అల వైకుంఠపురములో” రెండు చిత్ర యూనిట్లు ఒకరికొకరు ఈ రెండు చిత్రాలు బాగా ఆడాలని కోరుకున్నవారే అప్పుడు ఇద్దరి అభిమానులు ఎంతో ఆనందపడ్డారు.కానీ విడుదలయిన తర్వాత నుంచి మొదలు పెట్టారు ఒకటే..మ్యూజిక్కు.

మాది సంక్రాంతి విన్నర్ అంటే మాది మాది అసలైన విన్నర్ అని మాది మావే హైయెస్ట్ వసూళ్లు అని ఒకలు మావి “రియల్” కలెక్షన్ అని ఇంకొకరు ఏంటిది?? అసలు అభిమానుల మధ్య గొడవలు రాకూడదని ఒకరి సినిమా బాగా ఆడాలని ఇంకొకరు కోరుకోడం ఎందుకు మళ్ళీ అదే అభిమానులు గొడవ పడేలా రికార్డుల కోసం తన్నులాటలు.ఈ పోస్టర్ పిచ్చ వదిలి ఇక ముందు నుంచి అయినా సరే అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోకుండా వ్యవహరిస్తే అందరికీ మంచిది.