అర్జున్ రెడ్డి డైరెక్టర్ మరో బాలీవుడ్ సినిమా

Thursday, December 31st, 2020, 09:21:17 AM IST

తెలుగు నాట లవ్ స్టొరీ తో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి, ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లో కూడా రీమేక్ అయింది. ఈ చిత్రం తో సందీప్ రెడ్డి వంగా తాను ఏంటో ప్రూవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా ఇదే చిత్రాన్ని తెరకెక్కించి కాసుల వర్షం కురిపించారు. అయితే కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ దర్శకుడు ఇప్పుడు మరొక క్రేజీ హీరో తో సినిమా చేసేందుకు సిద్దం అయ్యారు.

బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా సినిమా చేసేందుకు సిద్దం అయ్యారు. అయితే టీ సీరీస్ మరియు వంగాపిక్చర్స్ యూ ట్యూబ్ ఛానెల్స్ లో ఇందుకు సంబంధించిన అప్డేట్ జనవరి 1, 12:01 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సందీప్ రెడ్డి మరొక లవ్ స్టొరీ తో వస్తారా లేదా వేరే జోనర్ లో తెరకెక్కిస్తారా అనేది ఆసక్తికరం గా మారింది.