సిక్స్ ప్యాక్ బాడీ తో రీషూట్ కి సిద్దం అయిన సందీప్ కిషన్

Monday, August 31st, 2020, 11:12:31 PM IST


యువ నటుడు సందీప్ కిషన్ ఆరు పలకల బాడీ తో రీషూట్ కి సిద్దం అయ్యారు. వరుస సినిమాలు చేస్తూ, సినిమా లని నిర్మిస్తూ బిజీ లైఫ్ గడిపేస్తున్నారు సందీప్ కిషన్, తాను హీరో గా నటిస్తున్న ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం రీషూట్ కి సిద్దం కావడం తో సందీప్ కిషన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రేపు షూటింగ్ కి రెడీ అయ్యేందుకు అంతా సిద్దం అయింది అని, అంకితభావం తో పని చేసే ఇలాంటి టీమ్ దొరకడం ఆశీర్వాదం గా భావిస్తున్నా అంటూ సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ బాడీ తో ఉన్న ఫోటో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సందీప్ కిషన్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ 1 ఎక్స్ ప్రెస్ చిత్రంలో కథానాయిక గా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా, ఈ చిత్రం హాకీ స్పోర్ట్స్ నేపధ్యం లో తెరకక్కుతున్న సంగతి తెలిసిందే.