అభిమానులకు సమంత క్రేజీ గిఫ్ట్!

Friday, August 28th, 2020, 01:33:56 AM IST


తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత, వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి సంబంధించిన వర్క్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను త్వరగా పూర్తి చేసుకొని విడుదల చేసేందుకు సిద్దం అవుతుంది. అయితే సమంత మొదటిసారిగా ఈ వెబ్ సిరీస్ కోసం తానే డబ్బింగ్ చెబుతుంది. ప్రతి సినిమా లో సమంత కి చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే సమంత మొట్ట మొదటి సారిగా అది కూడా వెబ్ సిరీస్ కి డబ్బింగ్ చెప్పడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సమంత చేస్తున్న ఈ పని పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమంత గిఫ్ట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతో ప్రాచుర్యం పొందడం తో దీనికి సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇందులో సమంత మొదటి సారిగా టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్ హిందీ లో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా డబ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కాబోతుంది. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.