RRR టైటిల్ వచ్చేసిందోచ్… పోస్టర్ దద్దరిల్లిపోయిందిగా…!

Wednesday, March 25th, 2020, 12:40:11 PM IST

మన దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నటువంటి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రానికి సంబందించిన టైటిల్ మరియు మోషన్ పోస్టర్ కొద్దిసేపటి క్రితం అధికారికంగా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ మోషన్ పోస్టర్ చూసాక సినిమా ఎలా ఉండబోతుందనేది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దానికితోడు ఈ చిత్రానికి అందరి అంచనాలను తల్లక్రిందులు చేసేలా “రౌద్రం రణం రుధిరం” అనే టైటిల్ ఫిక్స్ చేసాడు దర్శకుడు రాజమౌళి. దీనికి తోడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేసాడు దర్శక ధీరుడు. మంటల్లోంచి రామ్ చరణ్ వస్తుంటే, నీళ్ళల్లోనుండి ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇకపోతే చివరగా వీరిద్దరి కలయిక సమయంలో మాత్రం చిత్ర టైటిల్ “రౌద్రం రణం రుధిరం” అని రావడంతో ఒక్కొక్కరి ఒళ్ళు గగుర్పొడిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే… ఈ పోస్టర్ లో కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా మారనుంది. ఒక హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో RRR కి సంగీతాన్ని అందించాడు కీరవాణి… కాగా ఈ సినిమాతో రాజమౌళి మరొక సరి ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టించడం ఖాయం అని పక్కాగా అర్థమవుతుంది. దానికి తోడు ఈ పోస్టర్ లో ఇండియా 1920 అని జతపరిచాడు దర్శకుడు రాజమౌళి. అంటే ఈ సినిమా అంతా స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథ అని మనకు రాజమౌళి గతంలోనే చెప్పేశాడు. ఇక మోషన్ పోస్టర్ చూసాక ఈ చిత్రానికి సంబందించిన అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక సినిమా కోసం అందరు కూడా ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు…?