లేటెస్ట్ అప్డేట్: రేపటి వరకు వేచి ఉండండి – ఆర్ఆర్ఆర్ టీమ్!

Monday, October 5th, 2020, 09:48:29 PM IST

Rajamouli-RRR

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మొదటి సారి గా రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ కూడా కలిసి నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్ర లో రామ్ చరణ్ నటిస్తుండగా, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి సంబంధించిన కొమరం భీమ్ ఫర్ రామరాజు అనే వీడియో ఇప్పటికే ప్రేక్షకుల ను అలరించగా, ఎన్టీఆర్ వీడియో కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ ఒక అప్డేట్ ను అందుచనుంది. రేపు ఇందుకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి క్లారిటీ రానుంది. ఇప్పటి వరకు ప్రతి పండుగకు కూడా చిత్ర యూనిట్ చేస్తున్న పోస్ట్ ల పై ప్రేక్షకులు సెటైర్స్ వేస్తూ కామెంట్స్ చేస్తూ ఆటపట్టిస్తున్న సంగతి తెలిసిందే. మీ ప్రేమతో చంపుతున్నందుకు ధన్యవాదాలు అని, కాలం వేగంగా గడిచి పోయింది అని, చివరకు ఆ క్షణం వచ్చింది అని, మిమ్మల్ని అలరించడం ఇక మా వంతు అని, రేపటి వరకు వేచి ఉండండి అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ అప్డేట్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.