RRR చిత్రం లో అలియా భట్ ప్లేస్ ను భర్తీ చేయనున్న ఆ హీరోయిన్ ఎవరంటే!?

Tuesday, September 8th, 2020, 12:13:17 AM IST


దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం చిత్రం షూటింగ్ పునః ప్రారంభం అయ్యేందుకు సిద్దం అవుతుంది. అయితే ఈ చిత్రం లో అలియా భట్ ఒక కీలక పాత్ర లో పోషించనున్నారు. అయితే బాలీవుడ్ లో నేపోటిజం కారణంగా అలియా భట్ తాజా చిత్రం సడక్ 2 ఫలితం ఎలా ఉందో అందరికి తెలిసిందే. అత్యంత తక్కువ IMDB రేటింగ్ మాత్రమే కాకుండా, ట్రైలర్ కి సైతం డిస్ లైక్స్ తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాత్ర పై ఇపుడు చిత్ర యూనిట్ రీప్లేస్ మెంట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో అలియా భట్ స్థానం లో మహానటి కీర్తి సురేష్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అధికారిక ప్రకటన చేసే వరకు హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్. అయితే మొదటి సారి గా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు ఓకే చిత్రం లో కలిసి నటిస్తున్న నేపద్యం లో ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజు పాత్ర లో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు.