ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ షూట్ షురూ…ఎన్టీఆర్, రామ్ చరణ్ ల విశ్వరూపం!

Tuesday, January 19th, 2021, 05:04:11 PM IST

దర్శక దిగ్గజం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం ను వాస్తవికత తో కూడిన కల్పన చిత్రం గా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం అయినట్లు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే దీనికి తోడు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇద్దరూ కూడా కర చాలనం చేస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి చేసిన వీరోచిత పోరాటాలను చిత్రీకరించనున్నారు. అయితే వీరిద్దరూ కూడా చరిత్రలో ఎంతో గొప్ప పేరు ను, ఖ్యాతి ను కలిగి ఉన్నవారు కావడం, ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఇద్దరూ కూడా మాస్ హీరోలు అయి ఉండటం తో వీరి విశ్వరూపం ను తారాస్థాయి లో రాజమౌళి చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.