బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్‌కు గిఫ్ట్ పంపిన రోహిత్ శర్మ..!

Friday, January 15th, 2021, 01:14:52 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అబిజీత్‌కు టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అద్భుతమైన గిఫ్ట్ పంపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ అభిజిత్‌కి ఫోన్ చేసి అభినందించాడు. అంతేకాదు అభిజిత్‌కు రోహిత్ శర్మ తన జెర్సీని గిఫ్ట్‌గా పంపాడు. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్ రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి ఇచ్చాడు.

ఈ విషయాన్ని అభిజిత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. రోహిత్ శర్మ, తెలుగు క్రికెటర్ అయిన హనుమ విహారి మాట్లాడుకుంటుండగా బిగ్‌బాస్ చర్చ వచ్చింది. ఈ సందర్భంగా హనుమవిహారి బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ గురుంచి రోహిత్‌కి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తనకు హెల్ప్ చేసిన హనుమవిహారికి అభిజిత్ థాంక్స్ చెప్పాడు. చిన్నప్పుడు తాను క్రికెటర్ అవ్వాలనుకున్నానని కానీ విధి తనను సినిమాల వైపు నడిపించిందని, ఇప్పుడు క్రికెటర్ నుంచి గిఫ్ట్ అందుకోవడంతో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని అభిజిత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియాకు విజయం వరించాలని, అందరూ టీమిండియాకు సపోర్టు చేయాలని పిలుపునిచ్చాడు.