కంగనా సోకిన శివసేన కి కూడా వాక్సిన్ లేదు – ఆర్జీవీ

Wednesday, September 9th, 2020, 06:18:28 PM IST

Kangana-Ranaut-office

వివాదాలు అంశాల్లో ఎప్పుడు తల దూరుస్తూ ఉంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి పై తనదైన శైలిలో కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ, తాజాగా మహారాష్ట్ర లో జరుగుతున్న తాజా పరిణామాల పై, కంగనా వర్సెస్ మహారాష్ట్ర పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే మహారాష్ట్ర కి కంగనా నెక్స్ట్ సీఎం. అవుతుంది అని, అలానే ఆర్ణబ్ గోస్వామి పీఎం అయితే, శివసేన కనుమరుగు అవుతుందీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలానే ముంబై పోలీసులు రిపబ్లిక్ టీవీ తో రీప్లేస్ అవుతుంది అని, కాంగ్రెస్ పార్టీ కాస్త ఇటలీకి వెళ్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొక ట్వీట్ లో కరోనా సోకిన భారత్ కి వాక్సిన్ లేదు అని, అలానే కంగనా సోకిన శివసేన కి వాక్సిన్ లేదు అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.