జనాలకు సేవ చేసే ఉద్దేశ్యం నాకు లేదు.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Thursday, May 13th, 2021, 09:50:54 PM IST

విలక్షణ సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక విషయంలో తరచూ వార్తలో నిలుస్తుంటాడు. ఆయన ముక్కుసూటితనం, ఆయన మాట తీరు చూస్తే నలుగురు ఓ వైపు అంటే తాను మాత్రం ఇంకో వైపు అన్న మాదిరి వ్యవహరిస్తుంటాడు. అయితే కొన్నాళ్లుగా నిజ జీవిత వివాదాస్పద సంఘటనలకు సంబంధించిన ఎన్నో సినిమాలను ఆర్జీవీ తెరకెక్కిస్తున్న అవి పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. ఇదిలా ఉంటే ఆర్జీవీ త్వరలో స్పార్క్ ఓటీటీని ప్రారంభించబోతున్నాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్జీవికి ఓ విలేఖరి మీరు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. దానికి సమాధానంగా ఆర్జీవీ మాట్లాడుతూ అసలు తనకు రాజకీయాలపై ఇంటెస్ట్ లేదని, జనాలకు సేవ చేసే ఉద్దేశ్యం నాకు లేనే లేదని తేల్చి చెప్పేశారు. అంతేకాదు ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యం ఉన్న వాళ్లే రాజకీయాల్లో వస్తూ ఉంటారని, ఏ రాజకీయ నేత అయినా పేరు, అధికారం కోసమే రాజకీయాల్లో అడుగు పెడుతుంటారని కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేక ప్రజా సేవ అని పైకి చెప్పుకుంటారని ఆర్జీవీ కామెంట్స్ చేశారు.