హాట్ టాపిక్: వారిపై గట్టి సెటైర్స్ వేసిన ఆర్జీవీ

Wednesday, October 14th, 2020, 01:25:41 AM IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ పని చేసిన పబ్లిసిటీ మాత్రం ఫుల్ గా ఉంటుంది. ప్రతి అంశం పై వినూత్నంగా స్పందించే రామ్ గోపాల్ వర్మ మరోమారు బాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాల పై స్పందించారు. అయితే బాలీవుడ్ మురికి, డ్రగ్స్ అడ్డా, వరద కాలువ అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవమానించారు అని బాలీవుడ్ లో కొన్ని అసోసియేషన్ లు, 34 నిర్మాణ స్తంస్తలు రెండు టీవీ ఛానెళ్ల పై, నలుగురు యాంకర్ ల పై ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ లో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి, రిపోర్టర్ ప్రదీప్ బండారి, టైమ్స్ నౌ ఎడిటర్ రాహుల్ శివశంకర్, నవికా కుమార్ లు ఉన్నారు.

అయితే బాలీవుడ్ ప్రముఖులు వేసిన ఈ పిటిషన్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.బాలీవుడ్ ప్రముఖులు చాలా ఆలస్యంగా స్పందించారు అని, టాప్ ఫిల్మ్ సెలబ్రిటీలు అంతా కూడా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ముందు స్కూల్ పిల్లలు లాగా నిలబడి టీచర్, టీచర్ అర్ణబ్ మమ్మల్ని తిడుతున్నారు అని ఫిర్యాదు చేసినట్లు ఉంది అంటూ గట్టి సెటైర్స్ వేశారు.