రియల్ హీరో సోనూసూద్‌కి అరుదైన గౌరవం..!

Friday, December 18th, 2020, 01:00:44 AM IST

కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోశించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. సమస్య ఉందంటే దానికి సొల్యూషన్ సోనూలా కనిపిస్తున్నాడు. అయితే తాను చేస్తున్న సేవలకు ఇప్పటికే ఎన్నో సత్కారాలు అందుకున్న సోనూకు తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది.

అయితే సోనూసూద్‌కు ఈ అవార్డు ఓ సామాన్యుడు ఇవ్వడం విశేషం. ముంబైకి చెందిన ఇంద్రోజిర రమేశ్ అనే వ్యక్తి ఓ కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. అయితే సమాజ సేవ అంటే ఇతగాడికి చాలా ఇష్టమట. కానీ తన ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడంతో ఎవరైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే వారి ప్రతిమను తయ్యారుచేసి బహుమతిగా ఇస్తుంటాడు. అయితే అతగాడు దీనికి పద్మ సేవ అనే పేరు పెట్టుకున్నాడు. అందులో భాగంగానే అతడే స్వయంగా తయారు చేసిన ఫోటో ఫ్రేమ్ ను సోనూసూద్‌కు అందించి చిరు సత్కారం చేశాడు. ఈ సత్కారాన్ని సోనూసూద్ కూడా ఎంతో సంతోషంగా అంగీకరించాడు.