రవితేజ ‘ఖిలాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Saturday, January 30th, 2021, 08:00:04 PM IST

‘క్రాక్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ తన తరువాత సినిమాని రమేష్ వర్మ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ‘ఖిలాడి’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మే 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక రిపబ్లిక్ డే సందర్బంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా అది చాల బాగా ఆకట్టుకుంది. ఇక 2021ని విజయవంతంగా ప్రారంభించారు మాస్ మహారాజ రవితేజ.

‘క్రాక్’ థియేటర్లలో రఫ్ఫాడిస్తుండగానే రవితేజ నుండి ఈ అప్డేట్ రావడం అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. ‘క్రాక్ ‘ విజయంతో ఈ సినిమా పై అంచనాలు కూడ భారీగా పెరిగాయి. అందుకే డైరెక్టర్ రమేష్ వర్మ సినిమాలో మాస్ కంటెంట్ ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నారట. యాక్షన్ ఎపిసోడ్ల మీద మరింత దృష్టి పెట్టారట. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.