కిస్ డే స్పెషల్: విజయ్ దేవరకొండ, రాశీఖన్నా ముద్దులు వైరల్..!

Thursday, February 13th, 2020, 10:25:44 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా కాంత్రి మాధవ్ దర్శకత్వంలో వాలంటైన్స్ డే స్పెషల్‌గా రేపు రిలీజ్ కాబోతున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే నిన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ చిత్ర బృందం జోరుగా కొనసాగించింది.

అయితే తాజాగా రాశీ ఖన్నా ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ వాలెంటైన్స్ వీక్‌లో నేడు కిస్ డే సందర్భంగా రాశీఖన్నా హీరో విజయ్ బుగ్గపై ముద్దు ఇచ్చిన సన్నివేశం ఆ వీడియోలో ఉంది. అయితే కిస్ డే నాడు నెటిజన్లను ఈ ముద్దు వీడియో విపరీతంగా ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.