ట్రైలర్ తో నే హాట్ టాపిక్ గా మారిన “ఆర్జీవీ మిస్సింగ్”

Sunday, October 25th, 2020, 07:00:48 PM IST

వివాదాలతో ఆటలు ఆడుకొనే రామ్ గోపాల్ వర్మ మరొకసారి తన పై తానే ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్జీవీ మిస్సింగ్ పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ విజయదశమి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రం లో రాజకీయ నాయకుల తో పాటుగా, పలువురు సినీ ప్రముఖులను వ్యంగ్య రూపంలో చూపించడం జరిగింది.

రామ్ గోపాల్ వర్మ మిస్ అవ్వడం అనేది పబ్లిసిటీ స్టంట్ లేకపోతే నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అంటూ మొదలై, పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని ఓటిటీ ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ వరుస చిత్రాలు తెరకెక్కించడం మాత్రమే కాకుండా వాటిని విడుదల చేసి మరీ సొమ్ము చేసుకున్నారు. మరి ఈ చిత్రం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.