ఉగాది పచ్చడి కావాలా.. ఒళ్ళంతా పచ్చడి కావాలా – వర్మ..!

Tuesday, March 24th, 2020, 11:20:44 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా తాజాగా మరో 21 రోజులు కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. అంతేకాదు తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, అవసరమైతే సూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తామని హెచ్చరించారు. అయితే ఇప్పటికే రోడ్లపైకి వస్తున్న జనాలకు లాఠీ దెబ్బలను రుచి చూపిస్తూ, వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన దర్శకుడు రాం గోపాల్ వర్మ వ్యంగ్యంగా సెటైర్లు వేశాడు. ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి, ఒళ్ళంతా పచ్చడి కావాలంటే బయటికి రండి అంటూ ఇది పోలీసుల హెచ్చరిక అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.