మట్టిని ముట్టుకోవడం నాకు అసహ్యం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై వర్మ కామెంట్స్..!

Thursday, November 12th, 2020, 12:11:04 AM IST


వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రామ్ చరణ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఋఋఋ టీమ్, రాజమౌళి మొక్కలు నాటారు. అనంతరం రాజమౌళి దర్శకులు వీవీ వినాయక్, పూరీ జగన్నాధ్, రామ్ గోపాల్ వర్మకు ఛాలెంజ్ విసిరాడు.

అయితే ఈ ఛాలెంజ్‌పై స్పందించిన వర్మ తనకు దీనిపై ఆసక్తి లేదని బురద అన్నా, మొక్కలన్నా తనకు పడదని ట్వీట్ చేశాడు. అంతేకాదు తాను చాలా స్వార్ధపరుడినని మొక్కల విషయంలో తనకన్నా గొప్ప వ్యక్తులు నాటడమే వాటికి గౌరవమని అందుకే తనకు ఛాలెంజ్‌లపై ఆసక్తి ఉండదని చెప్పుకొచ్చాడు. మీకు, మీ మొక్కలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు రాజమౌళికి బదులిచ్చాడు.