హాట్ టాపిక్: ప్రవన్ కళ్యాణ్ అద్భుత నటుడు – రామ్ గోపాల్ వర్మ!

Wednesday, July 15th, 2020, 12:15:48 AM IST


రామ్ గోపాల్ వర్మ తన వరుస సినిమాలను ఏ మాత్రం అపడం లేదు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ లను ఒక దాని తర్వాత మరొకటి వదులుతూ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక ఫోటో షేర్ చేస్తూ పవర్ స్టార్ చిత్రం లో నటిస్తున్న ప్రవన్ కళ్యాణ్ అద్భుత నటుడు అని అన్నారు. అంతేకాక అందరికంటే కూడా ఇతను చాలా పవర్ ఫుల్ యాక్టర్ అని ట్యాగ్ లైన్ పెట్టేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే దమ్ము లేక రామ్ గోపాల్ వర్మ ఇలా దూప్ లతో సినిమా చేస్తున్నారు అని అన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎలాంటి విమర్శలు పట్టించుకోకుండా క్లైమాక్స్, నేకేడ్ చిత్రాల మాదిరిగా షూటింగ్ పూర్తి చేసి త్వరగా విడుదల చేసేయాలని ఆరాట పడుతున్నారు.