సినిమా లో అదే ఎక్కువగా రక్తి కడుతుంది అని భావిస్తున్నా – ఆర్జీవీ

Friday, August 28th, 2020, 10:44:23 PM IST


ఒక నగ్న సత్యం గా తన జీవితాన్ని చూపించేందుకు సిద్దం అయ్యారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా రామ్ గోపాల్ వర్మ నిజ జీవితం ఆధారంగా దొరసాయి దర్శకత్వం లో మూడు భాగాలుగా రామ్ గోపాల్ వర్మ జీవితం తెరకెక్కనున్న విషయం ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు ఆసక్తి కర విషయాలను వెల్లడించారు.

తన లైఫ్ లో జరిగిన అన్ని సంఘటన ల గురించి చిత్ర యూనిట్ కి తెలియజేసినట్లు తెలిపారు. 2008 ముంబై పేలుళ్ల తర్వాత రితేష్ దేశ్ముఖ్ తో కలిసి హోటల్ తాజ్ కి వెళ్ళాం అని, అయితే అప్పుడు ఏం జరిగింది అనే విషయాలు కూడా సినిమా లో చూపించనున్నాం అని అన్నారు.అయితే మొదటి రెండు భాగాల కంటే, మూడో భాగం లో వివాదాలు, శృంగార సన్నివేశాలు ఉంటాయి అని అన్నారు. తన రంగుల జీవితం గురించి అమ్మాయిలతో ఉన్న సంబంధాల గురించి చూపించనున్నట్లు తెలిపారు. అయితే ఇదే విషయం సినిమా లో ఎక్కువగా రక్తి కడుతుంది అని ఆర్జీవీ తన అభిప్రాయాన్ని తెలిపారు.