సై రా కి ఏడాది పూర్తి… రామ్ చరణ్ ఏమన్నారంటే?

Saturday, October 3rd, 2020, 01:14:21 AM IST


మెగాస్టార్ చిరంజీవి, నయనతార, తమన్నా భాటియా లు హీరో హీరోయిన్స్ గా నటించిన సై రా చిత్రం విడుదల అయి నేటికీ ఏడాది పూర్తి కావడం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ క్రూ, ఏ బెస్ట్ టీమ్, థాంక్స్ టు వన్ అండ్ ఆల్ అంటూ రామ్ చరణ్ అన్నారు. ఈ పోస్ట్ కి జత గా ఒక వీడియో ను పోస్ట్ చేశారు చరణ్. టీమ్ అంతా కలిసి సినిమా కోసం పని చేస్తున్నా పలు ఫొటోలను వీడియో తో నింపేశారు.

రామ్ చరణ్ సై రా చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. తండ్రి కోసం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా చిత్రాన్ని నిర్మించారు. ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి నిజ జీవితం గాథ ఆధారం గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ సైతం ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వగా, అనుష్క శెట్టి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తదితర కీలక నటులు మెప్పించారు.