అక్కడ ఎన్టీఆర్ కి కంటే రామ్ చరణ్ కే క్రేజ్ ఎక్కువా?

Sunday, April 5th, 2020, 07:09:06 PM IST


దర్శక ధీరుడు రాజమౌళి రౌద్రం రణం రుదిరమ్ చిత్రం కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ఈ చిత్రం కోసం పని చేస్తూనే ఉన్నారు. అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు కి భీమ్ ఫర్ రామరాజు వీడియో నీ విడుదల చేసిన చిత్ర యూనిట్, ఇపుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు వీడియో కోసం తెగ కష్టపడుతున్నారు.అయితే దీనికి కారణం లేకపోలేదు. రామ్ చరణ్ గతంలో జంజీర్ చిత్రం తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఇదివరకే పలకరించారు. అయితే అక్కడ ఎన్టీఆర్ అయింటే రామ్ చరణ్ కే క్రేజ్ ఎక్కువ అని చెప్పాలి. చిత్రం అంతగా ఆకట్టుకొక పోయినప్పటికీ రామ్ చరణ్ కి బాలీవుడ్ లో సైతం సత్సంబంధాలు ఉన్నాయి.

అయితే రామ్ చరణ్ తో పోలిస్తే ఎన్టీఆర్ కి కాస్త పబ్లిసిటీ అవసరం అని చిత్ర యూనిట్ భావిస్తుంది. అందుకే భీమ్ ఫర్ రామరాజు వీడియో కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇపుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు విడుదల అయ్యే వీడియో లో సైతం ఎన్టీఆర్ నీ పవర్ ఫుల్ గా, ఒక రేంజ్ లో జక్కన్న చూపించనున్నారు అని తెలుస్తుంది. రాజమౌళి బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు. ఈ చిత్రాన్ని అంతకు మించి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.