తన బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ అందించబోతున్న రామ్ చరణ్..!

Wednesday, March 25th, 2020, 11:00:25 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు ఈ నెల 27న ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండడంతో తాను పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం లేదని, ఫ్యాన్స్ కూడా ఎలాంటి హడావుడి చేయకండని రామ్ చరణ్ పిలుపునిచ్చారు.

అయితే రామ్ చరణ్ పుట్టిన రోజుకు రెండు రోజుల ముందే ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం ఫ్యాన్స్‌కి కాస్త నిరాశ కలిగించింది. దీంతో అభిమానులకు రామ్ చరణ్ ఒక అదిరిపోయే సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. తన పుట్టిన రోజు నాడు తన అధికారిక ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే అభిమానుల ముందుకొస్తున్న రామ్ చరణ్ ఇకపై ట్విట్టర్‌లో కూడా కనిపించబోతున్నాడు. అయితే రెండు రోజుల ముందే మెగస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.