“సిద్ధ” గా ఆచార్య సెట్స్ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్

Sunday, January 17th, 2021, 11:02:57 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం లోకి రామ్ చరణ్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. సిద్ధ గా సర్వం సిద్దం అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం లో రామ్ చరణ్ ఎప్పుడో చేరాల్సి ఉండగా, కరోనా వైరస్ పాజిటివ్ రావడం తో కొద్ది రోజులు ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా వైరస్ నెగటివ్ వచ్చిన అనంతరం సెట్స్ లోకి రావడం పట్ల అటు చిత్ర యూనిట్, ఇటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రామ్ చరణ్ సిద్ధ గా ఈ చిత్రం లో కనిపించనున్నారు. రామ్ చరణ్ ప్రి లుక్ మాత్రం అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మెడలో రుద్రాక్ష మాల, చెవికి పోగు తో రామ్ చరణ్ ఉన్నటువంటి పోస్టర్ ను విడుదల చేసారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం లో రామ్ చరణ్ ది కీలక పాత్ర అని కొరటాల శివ గతంలో వెల్లడించారు. అయితే రామ్ చరణ్ లుక్ పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.