మైండ్ బ్లోయింగ్…ఎప్పటిలాగానే పవర్ ఫుల్ గా ఉంది – రామ్ చరణ్

Tuesday, March 30th, 2021, 08:36:15 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదల అయింది. ఊహించని రీతిలో ఈ చిత్ర ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి మూడేళ్లు అయినా అభిమానుల్లో మాత్రం ఆ ఉత్సాహం తగ్గలేదు. అయితే ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. యూ ట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. 7 నిమిషాల్లోనే లక్ష లైక్స్ తో రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా పై ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

అయితే తాజాగా ఈ ట్రైలర్ విడుదల కావడం పట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. బాబాయ్, మైండ్ బ్లోయింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఎప్పటి లాగానే పవర్ ఫుల్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే అభిమానులు మాత్రం థియేటర్ల వద్ద తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ లో దూసుకు పోతుంది. ప్రస్తుతం 11 మిలియన్ వ్యూస్ తో 8లక్షలకు పైగా లైక్స్ తో దూసుకు పోతుంది. మరో పక్క 10 వేలకు పైగా డిస్ లైక్స్ సైతం సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీ దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అంజలి, నివేధా థామస్, అనన్య ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.