నేడు ఎన్‌సీబీ విచారణకు హాజరుకాబోతున్న రకుల్‌ప్రీత్..!

Friday, September 25th, 2020, 09:50:00 AM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానస్పద మృతి కేసులో డ్రగ్స్ వివాదం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే డ్రగ్స్ విషయంలో రియా సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లను వెల్లడించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అయితే రియా చెప్పిన ఆధారంగా దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లతో సహా టాలీవుడ్‌కి చెందిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ అధికారులు విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఎన్సీబీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని రకుల్ ప్రీత్ మేనేజర్ నిన్న ఖండించినా కొద్ది సేపటికే తనకి నోటీసులు అందాయని, శుక్రవారం విచారణకు హాజరవుతున్నట్టు రకుల్ వెల్లడించింది.