బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. తెరపైకి రకుల్ ప్రీత్ పేరు..!

Saturday, September 12th, 2020, 12:00:05 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ వినియోగం అభియోగాలతో రియా చక్రవర్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎన్సీపీ రియాను విచారించగా ఆమె సంచలన నిజాలను బయటపెట్టినట్టు సమాచారం. రియా చెప్పిన పేర్లలో డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, మరో డిజైనర్ సిమ్మన్ కంబాట పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే వీరితో పాటు మరో 25 మంది ప్రముఖులు కూడా డ్రగ్స్ వాడినట్టు తెలుస్తుంది. అయితే రియా చెప్పిన లిస్టులో మరికొందరు తెలుగు స్టార్స్ ఉన్నారని, రియా ఫోన్ కాల్ డేటాలో తెలుగు హీరో, హీరోయిన్ల నంబర్లు దొరికినట్టు తెలుస్తుంది. అయితే తెలుగు హీరో, హీరోయిన్లతో రియాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే త్వరలోనే రియా విచారణ ఆధారంగా డ్రగ్స్ వినియోగించిన వారందరికి ఎన్సీపీ సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.