హాట్ టాపిక్: క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్!?

Wednesday, July 29th, 2020, 11:20:27 PM IST

పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు సిద్దం అయిన దర్శకుడు సడెన్ గా వెబ్ సిరీస్ ల వైపు మళ్ళిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో సినిమా కాస్త ఆలస్యంగా మొదలు అయ్యే అవకాశం ఉండటం తో ఈ గ్యాప్ ను వెబ్ సిరీస్ ల కోసం కేటాయిస్తున్నారు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ. ఆహా ఆప్ కోసం దర్శకుడు క్రిష్ కొన్ని స్క్రిప్ట్ లని సిద్దం చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇపుడు ఒక వెబ్ సిరీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రకుల్ ఎటువంటి పాత్రను పోషిస్తుంది అనేది మాత్రం ఇంకా సస్పెన్స్.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ కి ఉన్నటువంటి హవా కాస్త తగ్గింది అని చెప్పాలి. రష్మిక, పూజ హెగ్డే లు రానిస్తుండగా, స్టార్ హీరోయిన్స్ సైతం ఖాళీగా ఉండటం తో సినిమా ల కొదవ ఉందని చెప్పాలి. అయితే ఇపుడు ట్రెండ్ అంతా వెబ్ సిరీస్ లదే కావడం తో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందుకు ఒకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో క్రిష్ విరూపాక్ష చేయాల్సి ఉండగా, పవన్ ఇంకా వకీల్ సాబ్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది.