హాట్ టాపిక్: ఆ బాలీవుడ్ హీరో నీ పొగడ్తలతో ముంచెత్తిన దర్శక ధీరుడు!

Monday, April 6th, 2020, 10:00:53 PM IST

బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరెక్కిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం అజయ్ దేవగన్ నీ రాజమౌళి ఎరి కోరి తీసుకున్నారు. అయితే ఈగ చిత్రం కోసం అజయ్ దేవగన్ నీ రాజమౌళి సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈగ చిత్రాన్ని హిందీ లో చేయాలి అని అనుకున్నప్పుడు అజయ్ దేవగన్ మరియు కాజోల్ నీ కలిసిన విషయాన్ని రాజమౌళి తాజాగా వెల్లడించారు. అయితే హిందీ వెర్షన్ కి వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు వీరిద్దరూ ఒప్పుకున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే వీరు మళ్లీ ఎనిమిదేళ్ళ తర్వాత కలిసి పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అయితే రౌద్రం రణం రూధిరం చిత్రంలో అజయ్ దేవగన్ పాత్ర కీలకం అని తెలుస్తోంది. అయితే అజయ్ నీ తీసుకోవడానికి గల కారణం రాజమౌళి తాజా వివరించారు. ముఖంలో, ఉచ్చరించే ప్రతి మాటలో నిజాయితీ అవసరం, అలానే సమగ్రత ఉండే నటుడు కోసం వెతికే ప్రయత్నం చేస్తున్నా, అంతేకాకుండా ఆ నటుడు మాటల్ని, ప్రవర్తన నీ అందరూ నమ్మేలా ఉండాలి అను అన్నారు. అయితే ఇవి చెప్పి కొందరిని అడగగా పది మందిలో 9 మంది అజయ్ దేవగన్ పేరు చెప్పారు. అయితే అజయ్ కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం సంతోషం, ఆయన ఎంతో అంకిత భావంతో పని చేశారని అన్నారు.