బిగ్ న్యూస్: రాజమౌళి మరియు కుటుంబీకులకు కరోనా నెగటివ్

Wednesday, August 12th, 2020, 06:00:16 PM IST

దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే మైల్డ్ సింటంస్ ఉన్నాయి అని, కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని అనంతరం ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే తాజాగా మరొకసారి సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా వైరస్ నెగటివ్ అని ప్రకటించారు. తనకు, తన కుటుంబీకులకు కరోనా వైరస్ నెగటివ్ అని ప్రకటించారు.

రెండు వారాల పాటు క్వారంటెన్ లో ఉన్నాం అని, కరోనా లక్షణాలు ఏమీ లేవు అని, కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోగా, అందరికీ నెగటివ్ వచ్చింది అని తెలిపారు. అయితే ప్లాస్మా దానం చేసేందుకు గానూ వైద్యులు మూడు వారాల సమయం పడుతుంది అని చెప్పిన విషయాన్ని తెలిపారు. శరీరం లో యాంటీ బాడీస్ తయారయ్యేందుకు మూడు వారాల సమయం పడుతుంది అని తెలుస్తోంది.

కాగా దర్శక ధీరుడు రాజమౌళి రౌద్రం రణం రుధీరం చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ షెడ్యూల్స్ అన్ని వాయిదా పడటం తో, కోలుకున్న అనంతరం తిరిగి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. రాజమౌళి అనుకున్నట్లు గా షూటింగ్ జరుపుకుంటే, వచ్చే ఏడాది జనవరి 8 న RRR చట్టం విడుదల అవుతుంది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజు పాత్ర లో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు.