కరోనా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు – రాజమౌళి

Tuesday, August 18th, 2020, 06:40:48 PM IST

దర్శకుడు రాజమౌళి ప్లాస్మా దానం గురించి సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సు లో పాల్గొన్నారు. అయితే ప్లాస్మా దానం గురించి, కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి తగు జాగ్రత్త చర్యలు వివరించారు. ప్లాస్మా దానం చేసేందుకు ఏ ఒక్కరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని తెలిపారు. సరైన సమయంలో కరోనా వైరస్ మహమ్మారి ను గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు అని అన్నారు. అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి విషయం లో నిర్లక్ష్యం చేయొద్దు అని సూచించారు. అయితే ఈ వైరస్ ను తరిమికొట్టే విషయం లో పౌష్టిక ఆహారం తీసుకోవాలి అని, వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్త చర్యలు పాటించాలి అని అన్నారు.

అయితే ఈ కార్యక్రమం లో సైబరాబాద్ కమిషనర్ సజ్జనర్ తో పాటుగా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కూడా పాల్గొన్నారు. కీరవాణి ప్లాస్మా దానం గురించి మాట్లాడారు. అంతేకాక కరోనా వైరస్ బాధితుల పై వివక్ష చూపరాడు అని అన్నారు. నేటి కరోనా వైరస్ బాధితులే రేపటి ప్రాణ దాతలు అని కీరవాణి అన్నారు.