ఈ రూపాయి సినిమాను నీ వేళ్ళతో పొడిచేస్తున్నావ్ – రఘు కుంచె

Wednesday, July 1st, 2020, 03:02:02 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పూర్తిగా మునిగిపోయింది. గతంలో మాదిరిగా దీయేటర్లు లేవు. సినిమాలకు ఓపెనింగ్స్ లేవు. అయినప్పటికీ ఎంతో దైర్యం చేసి సినిమాలను ఓటిటల ద్వారా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ చిత్రాలు బావున్నా,బాగోలేకపోయిన ప్రేక్షకుడికి ఏ నష్టం ఉండదు. అయితే ఎంతో కష్టపడి డబ్బు పెట్టిన నిర్మాతలకు మాత్రం ఇది కత్తి మీద సాము వంటిదే.

తాజాగా సత్యదేవ్ హీరోగా 47 డేస్ ది మిస్టరీ అన్ ఫోల్డ్స్ అంటూ సినిమా ఓటటీ ద్వారా విడుదల అయింది. అయితే ఈ చిత్రం బావున్నప్పటికి, రివ్యూ రైటర్స్ ఇస్తున్న రివ్యూ ల కారణంగా దర్శక నిర్మాతలు కాస్త ఆందోళన చెందుతున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి ఉన్న సమయం లో కూడా సినిమా రివ్యూ ల ను నిర్దాక్షిణ్యంగా నెగటివ్ రివ్యూ లు ఇస్తూ వ్యూస్ కోసం ఆశ పడుతున్నారు అంటూ ఆ చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె వాపోయారు. ఈ నేపధ్యంలో నెగటివ్ రివ్యూ ఇచ్చిన వారిని ఉద్దేశిస్తూ పరోక్షంగా నే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ నేపధ్యంలో రఘు కుంచె తన ఆవేదనను మాటల రూపంలో తెలిపారు. రూపాయి పెట్టీ సినిమా తీసిన నిర్మాత ఆ రూపాయి వస్తాడో రాదో అని బేల ముఖం వేసుకొని చూస్తుంటే, నువ్ నెట్ ఫ్లిక్స్ లో రాత్రి చూసిన 10 రూపాయల సినిమా తో పోల్చుకుని, ఈ రూపాయి సినిమా ను నే వేళ్ళతో పొడిచేస్తున్నావు చూడన్నా అని రఘు కుంచే ఆవేదన వ్యక్తం చేశారు.