వెన్నెలకంటి మృతి పై రఘు కుంచె భావోద్వేగం

Wednesday, January 6th, 2021, 08:21:54 AM IST

తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ గేయ రచయిత వెన్నెలకంటి. ఆయన మంగళవారం నాడు గుండెపోటు తో మృతి చెందడం తో ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందినవారు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.దాదాపు మూడు వందల సినిమాల్లో రెండు వేలకు పైగా పాటలు రాశారు శశాంక్ వెన్నెలకంటి. అయితే వెన్నెలకంటి మృతి పై ప్రముఖ సింగర్ రఘు బాబు భావోద్వేగం అయ్యారు. పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ నివాళులు అర్పించారు.

ప్రియమైన వెన్నెలకంటి గారు, పందెంకోడి అనే మూవీ లో ఓణీ వేసిన దీపావళి అనే పాటతో మొదటిసారిగా మీ సాహిత్యం తో గాయకుడు గా నా పాట ప్రయాణం 100 పాటలకు పైగా సాగింది అంటూ రఘు కుంచె తన కెరీర్ మొదలు విషయాలు చెప్పుకొచ్చారు. తన పై ఎంతో ప్రేమ చూపేవారు అని, తను పెద్దకొడుకు లాగా ఫీల్ అయ్యేవారు అని తెలిపారు. అయితే వెన్నెలకంటి రాసిన ప్రియతమా నీ వచట కుశలమా అనే పాటను కవర్ సాంగ్ గా పాడితే ఇళయరాజా కి వినిపించి, ఫోన్ లో మాట్లాడించిన అధ్బుతమైన క్షణాలు అంటూ గుర్తు తెచ్చుకున్నారు. శింబు, అజిత్, విజయ్ లాంటి హీరోలకు మీ మాటలతో, నేను డబ్బింగు చెప్పిన విషయాలు ఎలా మర్చిపోగలను అని,సరిగ్గా వారం క్రితం మాట్లాడకున్న విషయాన్ని వెల్లడించారు. అదేంటండి అలా వెళ్ళిపోయారు నమ్మలేక పోతున్నా ఇప్పటికీ అంటూ రఘు కుంచె చెప్పుకొచ్చారు.