ఫోటో మూమెంట్ : ఆ ప్రముఖ హీరోయిన్ సిగరెట్లు తాగుతుందా..!

Thursday, May 12th, 2016, 03:07:00 PM IST

radhika-apte
ఒకప్పుడు స్టైల్ గా సినిమాల్లో హీరోలు స్టైల్ గా సిగరెట్లు తాగడం ట్రెండేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పబ్లిక్ అవేర్నెస్ కోసం పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి పెద్ద పెద్ద స్టార్లు తమ సినిమాల్లో స్మోకింగ్ సన్నివేశాలను ఉండకుండా చూసుకుంటున్నారు. హీరోలు ఇలా బుద్దిగా ఉంటుంటే హీరోయిన్లు మాత్రం చెలరేగిపోతున్నారు. అప్పుడప్పుడు సినిమాలో స్మోకింగ్ సన్నివేశాల్లో నటిస్తూ బయట కూడా గుప్పు గుప్పున ఊదేస్తున్నారు. గతంలో మనీషా, కంగనా, సుస్మితా సేన్ వంటి ప్రముఖ హీరోయిన్లు సిగరెట్లు తాగేవారు. కానీ వాళ్ళేమీ పబ్లిక్ గా తాగలేదు. కానీ రాధికా ఆప్టే మాత్రం ఎంచక్కా చేతిలో వెలుగుతున్న సిగరెట్ పట్టుకుని ఫోటోలు తీసుకుని స్వయంగా సోషల్ సైట్లలో పెడుతోంది. దీన్ని చూసిన వారంతా నిజంగా రాధిక సిగరెట్లు తాగేస్తోందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.