ప్రభాస్ సినిమా పై అంచనాలు పెంచేసిన “ప్రేరణ”

Wednesday, October 14th, 2020, 01:31:42 AM IST

ప్రభాస్ రాధే శ్యామ్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ఇప్పుడు పండగ లానే అనిపిస్తుంది. పూజ హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా రాధే శ్యామ్ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక ఫోటో ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అయితే ఆ ఫోటో లో పూజ హెగ్డే నవ్వుతూ కనిపించింది. అయితే ఎదురుగా ఉన్నది. విడుదల అయిన కొద్ది సేపటికే ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే తను పోషిస్తున్న పాత్ర పేరు ప్రేరణ అంటూ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అయితే విడుదల అయినా ఈ ఫోటో చిత్రం పై అంచనాలను పెంచేసింది.

అయితే పూజ హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర యూనిట్ ఒక ఫోటో ను షేర్ చేసింది. అఖిల్ హీరో గా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.