పుష్ప చిత్రం కోసం ఫహద్ ఏం చేస్తున్నాడో తెలుసా?

Sunday, June 6th, 2021, 01:30:01 PM IST


దర్శకుడు సుకుమార్ సినిమా కోసం చాలా కష్ట పడుతున్నారు ఫహడ్ ఫాజిల్. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో విలన్ పాత్ర కోసం ఫహడ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఫహడ్ మలయాళం లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా కోసం, తన పాత్ర కోసం వంద శాతం తన వంతు కర్తవ్యం నెరవేరుస్తారు ఫహడ్. అయితే బన్నీ సినిమా మొదటి సారిగా పాన్ ఇండియా తరహాలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కోసం విలన్ తెలుగు నేర్చకుంటున్నారు. రాయలసీమ చిత్తూరు జిల్లా యాస ను ఈ లాక్ డౌన్ సమయం లో నేర్చుకుంటున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు సినీ పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మండన్న నటిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్.అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప ఇంట్రడక్షన్ వీడియో సోషల్ మీడియాలో రికార్డు లు సృష్టిస్తోంది. ఈ సినిమా కు సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.