షూటింగ్ కి సిద్ధం కానున్న పుష్ప టీమ్!?

Wednesday, August 26th, 2020, 03:00:29 AM IST

Allu-Arjun-Sukumar-Pushpa
అల వైకుంఠ పురం లో చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సరికొత్త చిత్రం పుష్ప. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజుల కే కరోనా వైరస్ మహమ్మారి కారణం గా షూటింగ్ వాయిదా పడింది. అయితే ప్రస్తుతం మళ్లీ పుష్ప టీమ్ చిత్రీకరణకు సిద్దంగా ఉంది అని తెలుస్తోంది. థాయిలాండ్ లో మొదటగా షూటింగ్ ప్రారంభం అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న కరోనా వైరస్ నిబంధనల కారణంగా జరిగే పరిస్థతి లేకపోవడం తో తెలంగాణ రాష్ట్రం లోని అడవుల్లో షూటింగ్ కి ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినా, త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన రశ్మిక మందన్న కథానాయిక గా నటిస్తుండగా, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.