బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన పుష్ప టీమ్… అల్లు అర్జున్ విలన్ ఇతడే!

Sunday, March 21st, 2021, 03:15:41 PM IST

Allu-Arjun-Sukumar-Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఊర మాస్ లుక్ లో ఉన్న అల్లు అర్జున్ కి కరెక్ట్ విలన్ కోసం చిత్ర యూనిట్ గాలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిత్రం లో విలన్ పాత్ర కొరకు చిత్ర యూనిట్ మలయాళ నటుడు ఫవాద్ ఫాజిల్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రతినాయక పాత్రలో ఫవాడ్ ఎలా ఉండనున్నారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసిన విలన్ పాత్ర వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి కే అల్లు అర్జున్ కి సంబంధించిన లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా ఆగస్ట్ 13 న ఈ చిత్రం విడుదల అయ్యేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.