బ్లాస్టింగ్ న్యూస్: ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు…పవన్ 28 వ సినిమా!

Wednesday, September 2nd, 2020, 08:12:01 PM IST

దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న చిత్రం యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసారు. అయితే వీరి కలయిక లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం కంటే భారీ బ్లాక్ బస్టర్ ఖాయం అనేలా పోస్టర్ ఉంది. ఢిల్లీ గేట్ ను బ్యాక్ గ్రౌండ్ లో చూపిస్తూ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ల ఫోటోల తో, స్టైలిష్ హార్లి డేవిడ్ సన్ బైక్ పై పెద్ద బాల శిక్ష బుక్ తో పాటుగా, ఆ బుక్ కింద రెడ్ రోజ్ కూడా ఉంది. అయితే ఎన్నో అంశాల కలయిక తో ఈ చిత్రం ఉండబోతుంది.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వత చేస్తున్న చిత్రాల పై ప్రత్యేక శ్రద్ద కనబరిచినట్లు పోస్టర్ లను చూస్తే అర్దం అవుతుంది. అంతేకాక ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాదు అంటూనే, అంతకు మించి ఉండబోతుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈసారి ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ తో పాటుగా సందేశాన్ని కూడా అందివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.