పవన్ 27 వ సినిమా ప్రీ లుక్ తో అద్దరగొట్టి…అంచనాలు పెంచేసిన క్రిష్

Wednesday, September 2nd, 2020, 06:52:07 PM IST

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు క్రిష్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందించాడు. పవన్ కళ్యాణ్ 27 వ సినిమా కి జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనింది కేవలం 15 రోజులు మాత్రమే. పదిహేను రోజుల షూటింగ్ ప్రతి క్షణం టీమ్ అందరికీ గొప్ప జ్ఞాపకం లా కదులుతుంది అని, చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది అని, ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం అంటూ పవన్ కళ్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటూ ఉండాలి అని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు క్రిష్.

ఈ చిత్రం లో పవన్ ఎలా ఉండబోతున్నారు అనేది ప్రి లుక్ ను చూస్తే అర్దం అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రి లుక్ విపరీతంగా నచ్చడం తో తెగ షేర్ చేస్తున్నారు. గతం లో పలు పీరియాడిక్ డ్రామా లు తెరకెక్కించిన క్రిష్, ఈ చిత్రం కూడా చరిత్ర తో ముడిపడి ఉండటం తో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయి కి చేరాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.