‘బాపుగారి బొమ్మ’ షాపింగ్ కి వచ్చింది!

Thursday, May 14th, 2015, 07:39:38 PM IST

pranitha
ప్రముఖ నటి ప్రణీత ప్రకాశం జిల్లా చీరాలలో కొత్తగా పెట్టిన ‘ఆకృతి’ షోరూం ప్రారంభోత్సవానికి గురువారం విచ్చేసింది. ఇక ఈ కార్యక్రమనికి ప్రణీతతో పాటు లోకల్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా హాజరయ్యారు. ఇక షాప్ ను ప్రారంభించిన ప్రణీత అనంతరం అక్కడ దుస్తులను, ఇతర వస్తువులను ఆసక్తిగా పరిశీలించింది. కాగా ప్రణీత రాక నేపధ్యంగా షోరూం వెలుపల ఆమె భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇక ప్రణీతను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో షోరూం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

కాగా బెంగుళూరు కన్నడ కుటుంబానికి చెందిన ప్రణీత ‘ఏం పిల్లో ఏం పిల్లాడో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అటు తర్వాత అడపాదడపా తెలుగు సినిమాలు చేసినప్పటికీ త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘అమ్మో.. బాపుగారి బొమ్మో’ అంటూ పవన్ చేత ప్రశంసించుకునే ముద్దుల మరదలిగా నటించింది. దీనితో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రణీత ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.