ఇక పై వెబ్ సిరీస్ లలో కనిపించనున్న టాలీవుడ్ విలక్షణ నటుడు!

Thursday, July 2nd, 2020, 01:07:43 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ లో విలక్షణ నటుడుగా పేరు గాంచిన ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్ లలో కనిపించ నున్నారు. ఇప్పటికే పలు చిత్రాలకు రచయిత గా, దర్శకుడు గా పని చేసిన ప్రకాష్ రాజ్ ఒక వెబ్ సిరీస్ కోసం మరోసారి రచయిత గా మారాడు. అంతేకాక ఆ సిరీస్ లో ఒక లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సిరీస్ కి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి పాత్రనైనా అవలీల గా చేయగలిగే ఈ స్టార్ యాక్టర్ ఇక వెబ్ సిరీస్ ల లో కూడా కనిపించడం ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పాలి.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ అమలు లో ఉండగా, వలస కార్మికులను నటుడు ప్రకాష్ రాజ్ ఆదుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇక పై కూడా కొనసాగిస్తా అని తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ చిత్రాలు కంటే, వెబ్ సిరీస్ లే బెటర్ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు వెబ్ సిరీస్ లలో నటించడం ఒక గొప్ప విషయం అని కొందరు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.