గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ప్రగ్యా జైస్వాల్..!

Wednesday, December 30th, 2020, 01:47:07 AM IST


టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే తాజాగా సినీనటీ ప్రగ్యా జైస్వాల్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంది. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రగ్యా జైస్వాల్ జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రగ్యా జైస్వాల్ పకృతిని అందరూ ప్రేమించి ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని, మొక్కల నుండి వచ్చే ఆక్సిజన్ తోనే మనం ఈ రోజు జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు. ఇంత మంచి మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకబోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ఆమె అభినందనలు తెలియచేసింది. ఈ ఛాలెంజ్ కొనసాగింపులో భాగంగా సినీ నటి రెజీనా కసండ్రా, డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రముఖ యోగా గురు అనుష్క లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ప్రగ్యా జైస్వాల్ పిలుపునిచ్చింది.